సంక్రాంతికి మరో చిన్న సినిమా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యాంగ్రీ మన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కూతురు శివాని ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ విద్య వాసుల అహం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో యువ కథానాయకుడు రాహుల్ విజయ్ హీరో గా నటించాడు. ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... అనేది ఈ మూవీ కి ఉపశీర్షిక. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఈ సారి సంక్రాంతి పండుగ కు మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ,  నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి , తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ హీరో గా తెరకెక్కిన తునివు ,  మరో తమిళ స హీరో అయినటువంటి తలపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వారిసు మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఇలా ఈ మూవీ లకు పోటీగా విద్య వాసుల అహం అనే మూవీ ని విడుదల చేయబోతున్నారు. మరి ఈ మూవీ భారీ అంచనాలు కలిగిన ఆ నాలుగు మూవీ లతో పోటీ పడి ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే. ఇది ఇలా ఉంటే తాజాగా విద్య వాసుల అహం మూవీ నుండి మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: