ఉదయ్ నిధి అలా చేయడంతో భయపడుతున్న దిల్ రాజు..కారణం..?

Divya
ప్రస్తుతం ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఏం మాట్లాడినా సరే అది కాంట్రవర్సీగా మారుతోంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. నేను ఏం మాట్లాడాలన్నా భయం వేస్తోంది.. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని బిట్స్ మాత్రమే ఒక వర్గం వారు బాగా వైరల్ చేస్తున్నారు.. ఒకరి ఎక్కువ.. ఒకరు తక్కువ అని నేను చెప్పాను.. అంటూ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి తన గోడు వెళ్ళబోసుకున్నారు దిల్ రాజు. తమిళ్ హీరోల్లో విజయ్ నెంబర్ వన్ అని.. తర్వాతే అజిత్ అని.. వచ్చే పొంగలికి విజయ్ వరిసు, అజిత్ తునివు పోటీ పడుతున్నాయి. విజయ్ కి అజిత్ కి కోలీవుడ్లో 800 థియేటర్స్ లో సగం అంటే 400, 400 థియేటర్స్ ఇస్తామని అన్నారు.
విజయ్ స్టార్ హీరో కాబట్టి అతనికి 400 థియేటర్స్ తో పాటు అదనంగా 50 థియేటర్స్ ని పెంచమని తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలిసి అడుగుదాం అనుకుంటున్నాను అంటూ దిల్ రాజు మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత తమిళ్ ప్రేక్షకులు దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . దాంతో కాస్త బాధపడిన దిల్ రాజు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా సరే కాంట్రవర్సీ చేస్తున్నారు.. అందుకే ఏం మాట్లాడాలి అన్నా కూడా భయం వేస్తుంది అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి తన బాధను వెల్లడించాడు

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న  ఉదయ్ నిధి అజిత్ తునివు తమిళ్ సినిమా హక్కులను సొంతం చేసుకోగా మరొకవైపు విజయ్ వరిసు సినిమాకి కూడా ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలన్న దిల్ రాజు అభ్యర్థనను ఉదయ్ పక్కన పెట్టేసాడు అని సమాచారం. దీంతో దిల్ రాజు తన సినిమాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: