మళ్ళీ ఇరుక్కున్న రకుల్ ప్రీత్..అడ్డంగా బుక్కయింది..

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమ లో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. అయితే ఈ మధ్య అమ్మడుకు టైం బాగ్లెదని తెలుస్తుంది.. సినిమాల కన్నా ఎక్కువగా వివాదాల తో బాగా ఫెమస్ అయ్యింది. టాలీవుడ్‌ లో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు విచారించగా, తాజాగా మరో స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు..

గతేడాది సెప్టెంబర్ 3 న రకుల్ ప్రీత్ సింగ్‌ ను ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం పై ఈడీ అధికారులు విచారించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విచారణ నుంచి మధ్యలోనే రకుల్ వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెను మళ్లీ విచారణ కు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించారు. టాలీవుడ్‌ లో 2017లో ఈ డ్రగ్స్ వ్యవహారం బట్టబయలు కావడం తో ఎన్డీపీఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఇక సిట్ ఏర్పాటు కావడం, పలువురు సినీ ప్రముఖుల ను విచారించడం జరిగింది..

ఇక పోతే మనీలాండరింగ్ కింద ఈ కేసును ఈడీ టేకప్ చేయడం తో గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలువురు సినీ ప్రముఖుల కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈడీ విచారణకు పూరీ జగన్నాధ్, రవితేజ, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి వంటి స్టార్స్ హాజరు కాగా, ఇప్పుడు మరోసారి రకుల్ ఈ విచారణ ను ఎదుర్కోనుంది.. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు ఆమె సినిమాలు మాత్రం చెయ్యలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ ఫోటోల తో రెచ్చగోడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: