పవన్ వైపు చూస్తున్న విజయ్ మెగా అభిమానులలో టెన్షన్ !

Seetha Sailaja
సంక్రాంతి పండుగ ఇక కేవలం నెలరోజుల లోపు ఉండటంతో ‘వాల్టేర్ వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ మూవీల హడావిడి రోజురోజుకు పెరిగి పోతోంది. ఈసారి సంక్రాంతి రేస్ చాల సంవత్సరాలు తరువాత చిరంజీవి బాలకృష్ణల ఇగో వార్ గా మారడంతో వీరిద్దరి అభిమానులలో కూడ విజేత ఎవరు అన్న టెన్షన్ అప్పుడే మొదలైపోయింది.

ఎప్పుడు లేని విధంగా ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమా ఏకంగా టాప్ హీరోల సినిమాలకు పోటీగా విడుదల కావడమే కాకుండా ఆ సినిమాల వెనుక ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ హస్తం ఉండటంతో ఈసారి సంక్రాంతి రేస్ చాల ఆశక్తిగా మారింది. దిల్ రాజ్ వంశీ పైడిపల్లి విజయ్ ల ‘వారసుడు’ వాస్తవానికి తెలుగు సినిమా కాకపోయినప్పటికీ ఆమూవీని డైరెక్ట్ తెలుగు సినిమాగా అత్యంత భారీ స్థాయిలో చిరంజీవి బాలకృష్ణల మూవీలతో సమానంగా ప్రమోట్ చేయబోతున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి.

వాస్తవానికి విజయ్ గతంలో నటించిన సినిమాలు చాలావరకు తెలుగులో డబ్ అయినప్పటికీ వాటి ప్రమోషన్ కు ఎప్పుడు విజయ్ హైదరాబాద్ రాలేదు. అయితే ఈసారి విజయ్ తన మనసు మార్చుకుని తెలుగు రాష్ట్రాలలో తన మార్కెట్ పెంచుకోవడానికి దిల్ రాజ్ సహకారంతో వారసుడు మూవీని అత్యంత భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడ హైదరాబాద్ లో భారీ స్థాయిలో చేస్తారని తెలుస్తోంది.

దిల్ రాజ్ ఈమూవీకి నిర్మాత కావడంతో ఈమూవీ పి క్రేజ్ పెంచడానికి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా పిలవడానికి ఇప్పటి నుండే రాయబారాలు మొదలుపెట్టినట్లు టాక్. వాస్తవానికి పవన్ కు విజయ్ మీద మంచి అభిప్రాయం ఉండటంతో అతడు కూడా ఈ ఫంక్షన్ కు దిల్ రాజ్ ఒత్తిడి పై వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అయితే ఇదే సంక్రాంతి రేస్ కు చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ విడుదల అవుతున్న సందర్భంలో ఆసినిమా గురించి మాట్లాడకుండా కేవలం విజయ్ సినిమా గురించి మాట్లాడే సాహసం చేయగలడా అన్న సందేహాలు చాల మందిలో వస్తున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: