ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ సొహైల్..ఎందుకో తెలుసా?

Satvika
బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫెమస్ అయ్యారు.. అందులో కొంతమందికి సినిమా అవకాశాలు వస్తే మరికొంతమంది మాత్రం వివిధ రకాల షోల ద్వారా ఫెమస్ అవుథున్నారు. అందులో సొహైల్ కూడా ఒకడు..బిగ్ బాస్ ముందువరకు ఈ పేరు అంతగా ప్రజలకు తెలియదు. కానీ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించాడు కానీ అంతగా గుర్తింపు రాలేదు.
 

తన అల్లరితో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హోస్ లో ఉన్నప్పుడు అరియానాతో వైరం.. ఫ్రెండ్ షిప్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రస్తుతం హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సోహైల్.. జీవితంలో మాత్రం అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రస్తుతం స్థాయికి చేరుకున్నాడు. మాటలతో ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట. అందుకు గల కారణాలను ఇటీవల అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చారు సోహైల్. తన స్నేహితుడు.. రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి అలీతో సరదాగా షోలో పాల్గొన్న సోహైల్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ సరదాగా వుండే సొహైల్ చనిపొవాలనుకున్నా డట..అంత కష్టం ఏమోచ్చిందో అని అందరూ ఆలోచనలో పడ్డారు.. సోహైల్ మాట్లాడుతూ..నేను చాలా సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి.. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడిగేవారు. ఎప్పుడు సెటిల్ అవుతావు.. అని. కానీ నాకేమో లంటే ఇష్టం. అప్పటికీ రెండు ల్లో నటించాను కానీ. హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లోఉద్యోగమంటూ ఒత్తిడి. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చింది.ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా నా గమ్యం ఇది కాదు అని వెనక్కు వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. కానీ ఇలా నేను ఉండటానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సొహైల్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: