దర్గాలో ప్రార్ధనలు చేసిన రజినీ, రెహ్మాన్?

Purushottham Vinay
ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈరోజు ఏపీలో పర్యటించారు. ఆయన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో రజినీకాంత్ ప్రార్థనలు చేశారు.ఇక ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పెద్ద కుమార్తె ఐశ్వర్యతో కలిసి రజినీకాంత్ వచ్చారు. ఆ తరువాత తలైవా అమీన్ పీర్ దర్గాలో కూడా ఆయన ప్రార్థనలు చేశారు.ఇంకా అలాగే పాన్ వరల్డ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఆస్కార్ అవార్డు పొందిన సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ కూడా దేవున్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ హల్‌చల్ చేస్తున్నాయి.సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక తలపాగాతో తెల్లటి కుర్తాని ధరించి కనిపించారు. ఇక రజినీకాంత్ కి అలాగే ఏ ఆర్ రెహ్మాన్ కి చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఏ ఆర్ రెహ్మాన్ రజినీకాంత్ కి చాలా పెద్ద అభిమాని కూడా. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబర్ 12 వ తేదీన తన 72వ పుట్టినరోజుని జరుపుకున్నారు.


రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ అతిథి పాత్రలో లాల్ సలామ్ అనే సినిమాలో తన కూతురితో కలిసి నటిస్తున్నారు. ఇంకా అలాగే లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ తన కూతురుతో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా అలాగే మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గారి అన్న శివ రాజ్‌కుమార్, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్ ఇంకా అలాగే వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకి తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రజిని బర్త్ డే సందర్బంగా విడుదల అయిన జైలర్ గ్లింప్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: