రేపే అవతార్ 2 రిలీజ్ ... "16 వేల కోట్లు" కలెక్షన్ లు సాధ్యమేనా !

VAMSI
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఒకే ఒక్క సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ ఆనందం క్షణాలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు తెల్లవారుజాము నుండి అన్ని చోట్ల అవతార్ కు సీక్వెల్ గా తెరకెక్కిన "అవతార్: ది వే అఫ్ వాటర్" మూవీ ఘనంగా థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను కన్నుల విందుగా తెరకెక్కించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అవతార్ తో సక్సెస్ అవుతాడా అన్నది చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న. అయితే ఇందులో కథ కన్నా కూడా గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ట్రైలర్ లో చూస్తే అర్ధమవుతోంది.
ఎలాగూ అవతార్ పార్ట్ 1 లో ఈ ప్రత్యేక ప్రపంచాన్ని అభిమానులకు పరిచయం చేశాడు కాబట్టి... ఈ పార్ట్ 2 లో మాత్రం గ్రాఫిక్స్ తో మరో అందమైన మరియు అద్బుతమయిన లోకానికి అందరినీ తీసుకెళ్లనున్నట్లు సినిమా యూనిట్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది. ఇక రెండు రోజుల క్రితం ప్రీమియర్ షో లు కూడా జరిగాయి.. అయితే వాటి ద్వారా కొంత మేరకు సినిమాపై నెగటివ్ రివ్యూ లు కూడా అంతర్జాలంలో స్ప్రెడ్ చేశారు. కానీ అవతార్ మూవీ టీం అంతా ఇవేమీ నమ్మొద్దని సినిమా మాములుగా ఉండదు అంటూ భరోసాను కల్పిస్తున్నారు. అయితే ఎంతవరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా మేకర్స్ నుండి తెలిసి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అవతార్ కు అత్యధికంగా కలెక్షన్ లు వస్తాయని ఘంటాపధంగా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కలెక్షన్ ఫిగర్ కూడా అసాధారణంగా ఉంది.. మేకర్స్ అంచనాలు మరియు టార్గెట్ 16 వేల కోట్ల రూపాయలుగా పెట్టుకున్నారట. అయితే అంత కలెక్షన్ లు రావడానికి అవకాశం ఉందా ? అసలు ఇది సాధ్యమయ్యే టార్గెట్ ఆ అంటూ అటు ప్రేక్షకులు మరియు సినిమా వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరి చూద్దాం అవతార్ 2 ఫుల్ రన్ లో ఎన్ని కోట్ల కలెక్షన్ లను అందుకుంటుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: