వాల్టేర్ వీరయ్యకు ఒకనాటి ప్రజారాజ్యం స్ట్రాటజీ !

Seetha Sailaja
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రారంభించే భారీ బహిరంగ సభకు అప్పటి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుండి కొన్ని ప్రత్యేక రైళ్ళు వేసి చిరంజీవి అభిమానులను తిరుపతి తరలించారు. అప్పట్లో ఆసభ ఆనాటి రాజకీయాలలో సంచలనం. లక్షలాది సంఖ్యలో వచ్చిన అభిమానుల ఉత్సాహం మధ్య చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన హడావిడి చూసినవారికి కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి మాత్రమే అన్న అభిప్రాయాలు కలిగాయి.

ఇప్పుడు మళ్ళీ అలాంటి ‘ప్రజారాజ్యం’ స్ట్రాటజీని సంక్రాంతి రేస్ కు విడుదల కావలసిన ‘వాల్టేర్ వీరయ్య’ కు ఉపయోగిస్తున్నారా అన్నసందేహాలు కలుగుతున్నాయి. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత భారీస్థాయిలో విశాఖపట్నంలో జనవరి 8న నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చే మెగా అభిమానుల కోసం హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు ఒక ప్రత్యేక రైలును 20 బోగీలతో నడిపే విధంగా ఇప్పటికే చిరంజీవి పిఆర్ టీమ్ రంగంలోకి దిగింది అన్న వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా రాజకీయ నాయకుల సభలకు ఇలా బస్సులు రైళ్ళు వేస్తూ ఉంటారు. అయితే చిరంజీవి టాప్ హీరో కాబట్టి అతడి స్టామినాను మరొకసారి తెలుగు ప్రజలకు గుర్తుకు చేయడానికి ఇలాంటి స్ట్రాటజీని అవలంభిస్తున్నారా అని అనిపించడం సహజం. ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖపట్నంలో చిరంజీవి అభిమానుల సంఖ్య చాలఎక్కువగా కనిపిస్తుంది.

దానితో ఈఫంక్షన్ కు లక్షమంది వచ్చే విధంగా మెగా ప్లాన్ డిజైన్ అవుతున్నట్లు టాక్. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ ఆతరువాత విడుదలైన ‘గాడ్ ఫాదర్’ ఏవరేజ్ హిట్ కారణాలతో చిరంజీవికి బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. అందుకోసమే ఈమూవీ మ్యానియాను పెంచడానికి ఇలాంటి స్ట్రాటజీ అని అంటున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు నిజం అయితే ఇదే మూవీతో పోటీగా విడుదల అవుతున్న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏ రేంజ్ లో నిర్వహిస్తారో అని నందమూరి అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: