రవితేజ ధమాకా ట్రైలర్ ఈరోజే..!

Divya
మాస్ మహారాజా రవితేజ హీరోగా.. పెళ్ళి సందD ఫేమ్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ధమాకా.. విశ్వప్రసాద్ వివేక కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాని నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహిస్తూంచారు . మాస్ కంటెంట్ పై మంచి పట్టున్న దర్శకుడు ఈయన.. అందుకే ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వదిలిన అప్డేట్స్ కారణంగా.. ఈ సినిమా పూర్తిగా రవితేజ మార్క్ చూపించే సినిమా అని స్పష్టమవుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు.  ఈరోజు సాయంత్రం 6:45 నిమిషాలకు ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈనెల 23వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రావు రమేష్,  సచిన్ ఖేడ్కర్, జయరాం, తులసి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది రవితేజ నుంచి వస్తున్న మూడవ చిత్రం కావడం గమనార్హం.  కనీసం ఈ సినిమా అయినా ఆయనకు హిట్ ఇస్తుందో లేదా చూడాలి.

రవితేజ ప్రస్తుతం కంటెంట్ తో సంబంధం లేకుండా కౌంట్ పరంగా సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శ కూడా మొదలయ్యింది.. రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడి వంటి రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య విడుదలై అంతకంటే దారుణంగా డిజాస్టర్ పాలయ్యాయి దీంతో రవితేజ కెరియర్ లో కొనసాగాలంటే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని కొట్టాల్సిందే అన్న వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు రవితేజ. మరి రవితేజ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కొడితే తప్పకుండా ఆయన సక్సెస్ అయినట్టే.. లేకపోతే ఆయన సినిమాలకు ప్రేక్షక ఆదరణ తగ్గిపోతుందని కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: