మహేష్ బాబు ఒక్కడు రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. భూమిక హీరోయిన్గా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో పోషించిన చిత్రం ఒక్కడు. 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో తెలుగు తర్వాత తమిళ్, కన్నడ, హిందీ ,బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేయడం జరిగింది. 2003 జనవరి 15వ తేదీన రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఊహించనీ విధంగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మహేష్ బాబు కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ఈ సినిమా.
ప్రస్తుతం రీ రిలీజ్ మూవీల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ ట్రెండు సెట్ చేసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులనే చెప్పాలి . ఆయన పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ కి పునాది వేశారు.  ఇప్పుడు ఇదే ట్రెండు చాలామంది హీరోలు,  దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే చిరంజీవిని మొదులుకొని బాలకృష్ణ,  పవన్ కళ్యాణ్ , రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఒక్కడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 7వ తేదీన రీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతుండడంతో అభిమానుల ఆనందాలకు అవధులు లేవు. ఇకపోతే మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో  ఒక సినిమా చేయబోతున్నారు.  ఈ సినిమా తర్వాత రాజమౌళితో పాన్ ఇండియా లెవెల్ లో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: