ప్రబాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విశాల్..!!

murali krishna
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరయ్యా అంటే అది ప్రభాస్ అని చెప్పక తప్పదు మరీ. మన డార్లింగ్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆయన కుటుంబం నుంచి ఆయన అభిమానుల వరకూ ఎందరో ఎదురుచూస్తున్నారు.
ఇక ఆయన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు చివరి కోరిక కూడా అదే అంటా మరీ,కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. నాలుగు పదులు దాటినా ఇంకా సినిమాలు చేసుకుంటున్నాడు కానీ.. పెళ్లి మాట ఎత్తడం లేదు.
ప్రభాస్ పెళ్లి టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్. ఢిల్లీ నుంచి తమిళనాడు వరకూ ఇదే చర్చ. అందుకే ఈ మధ్య కాలంలో మన యంగ్ హీరోలను పెళ్లి ఎప్పుడు అంటే.. 'అరే.. మా కంటే చాలా పెద్ద అయిన ప్రభాస్ యే పెళ్లి చేసుకోలేదు.. మాకెందుకు తొందర.. ప్రభాస్ పెళ్లి అయ్యాక చేసుకుంటానని..' ఇటీవల అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఎదుట కుర్ర హీరో శర్వానంద్ కూడా ఇలా చెప్పుకొచ్చాడు.
తాజాగా ఇంకో హీరో కూడా ఇదే మాట అనడం విశేషం మరీ. తమిళ యంగ్ హీరో విశాల్ కూడా అదే మాట అన్నాడు. తన తాజా చిత్రం 'లాఠీ' ప్రమోషన్స్ లో  చాలా బిజీగా ఉన్న విశాల్ కు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే ఓ చిత్తూరు అమ్మాయితో ఎంగేజ్ మెంట్  కూడా అయ్యి క్యాన్సిల్ అయ్యింది మరీ. ఓ హీరోయిన్ తో అనుకున్నారు అదీ పోయింది. ఇక వైజాగ్ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయ్యి కూడా రద్దు అయ్యింది. అంతకుముందు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతోనూ మన విశాల్ పీకల్లోతు ప్రేమలో మునిగాడు. అది బ్రేకప్ అయ్యాక పెళ్లి ప్రయత్నాలు చేసినా  ఇలా విఫలమవుతున్నాయి.
ఈ క్రమంలోనే పెళ్లి ఎప్పుడు అని తాజాగా ప్రమోషన్ లో పాల్గొన్న విశాల్ ను మీడియా ప్రశ్నించగా  బాగా అసహనానికి గురయ్యాడు. 'పెళ్లి అనేది నాకు జోక్ కాదు.. ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం వర్క్ లైఫ్ పైనే ఉంది' అన్నారు. ఇక వచ్చే ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నిస్తే.. 'ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని' విశాల్ ఇలా పెళ్ళి వాయిదా వేశాడు. ప్రభాస్ ఇంట్లో వాళ్లు ఎంత ఒత్తిడి తెచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆయన పెళ్లి జరగడం కల్లా.. విశాల్ నెపం మొత్తం ప్రభాస్ పైనే నెట్టేసి ఊపిరిపీల్చుకున్నాడు. కుర్ర హీరోలందరూ ఇప్పుడు ప్రభాస్ పెళ్లితో ముడిపెడుతూ ఉన్నారు ఈ యువ  హీరోలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: