ఆ తేదీ నుండి "దసరా" మూవీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి నచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని కేవలం సినిమాల్లో హీరో పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా ఈ మ ధ్యకాలంలో సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా నాచురల్ స్టార్ నాని ... వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ... హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని కూడా రూపొందించాడు.

డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తేరకేక్కుతున్న దసరా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , పూర్ణ ఈ మూవీ లో ప్రతినాయక పాత్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈనెల 16 వ తేదీ నుండి ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి నాని కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ఆ లుక్ లో నాని గెటప్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: