"అవతార్ 2" మూవీలో మైనస్ లు ఇవేనా.. మేకర్స్ కు షాక్ ?

VAMSI
హాలీవుడ్ నిర్మాత , రచయిత మరియు దర్శకుడు జేమ్స్ కామెరూన్ సినిమాల గురించి మరియు అతని దర్శకత్వ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై ఇతని సినిమాలు మనల్ని వేరే లోకానికి తీసుకువెళతాయి. ముఖ్యంగా ఇతని కెరీర్ లో అన్ని బాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలలో టైటానిక్ మరియు అవతార్ లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఇప్పుడు తాజాగా కామెరూన్ నుండి అవతార్ కు సీక్వెల్ గా "అవతార్: ది వే అఫ్ వాటర్" మూవీ మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రేపు రాత్రి నుండే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉంది.
ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు, ప్రస్తుతం ఈ సినిమా టికెట్ లు దొరికే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అవతార్ కు ఇండియా నుండే భారీగా కలెక్షన్ లు నమోదు అవుతాయని తెలుస్తోంది. అంతే కాకుండా అత్యధికంగా ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి వస్తాయని భావిస్తున్నారు. కాగా నిన్న ముంబైలోని ఒక థియేటర్ లో స్పెషల్ షో వేసి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారట మేకర్స్. ఈ సినిమా చూసిన కొందరు యావరేజ్ అని చెప్పుకుంటున్నారని వినికిడి. ఇక ఈ విషయం అలా ఇలా పాకి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వీరి టాక్ ప్రకారం అవతార్ సీక్వెల్ ఏమంత బాగాలేదని... మొదటి పార్ట్ ను కాస్త అటూ ఇటూ కలిపి గ్రాఫిక్స్ మరింత జోడించి తీశారని అంటున్నారు. ఇక ఈ సినిమా రన్ టైం కూడా సమస్యగా తెలుస్తోంది.. మొత్తం 3 గంటల 12 నిముషాల సినిమాలో దాదాపు అరగంటకు పైగా బోర్ కొట్టిందని రివ్యూ చెబుతున్నారు. మరి ఈ రివ్యూల ప్రకారం సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: