బాలీవుడ్ లో మరోసారి బాయికాట్ ఫ్రెండ్..!

Pulgam Srinivas
బాలీవుడ్ భాషా షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత పఠాన్ అనే భారీ బడ్జెట్ మూవీ లో షారుక్ ఖాన్ హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , దీపికా పదుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని జనవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేసింది. ఆ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ సాంగ్ లో దీపిక తన అంద చందాలను ఆర బోయడానికి ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా తన అంద చందాలను ఆరబోయడం తో ఈ పాటకు దీపిక  ద్వారా కూడా అద్భుతమైన క్రేజ్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ని బైకాట్ చేయాలి అంటూ ట్విట్టర్ లో కొంత మంది నేటిజన్ లు ట్రెండ్ చేస్తున్నారు. ఇది వరకే అనేక బాలీవుడ్ మూవీ లను బైకాట్ చేయాలి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే పఠాన్ మూవీ ని కూడా బాయ్కాట్ చేయాలి అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: