సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్..!

Pulgam Srinivas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి ది కంక్లూజన్ మూవీ లతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం కూడా ప్రభాస్ వరుస మూవీ లలో హీరో గా నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్నాం అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు గెస్ట్ గా విచ్చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
 

తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో ను కూడా ఆహా నిర్వాహక బృందం విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ కు అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ప్రభాస్ వచ్చాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రభాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి  అలాగే ఈ ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ ,  ప్రభాస్ మరియు గోపీచంద్ లను అనేక ఆసక్తికరమైన విషయాలను అడిగినట్లు , వాటికి వీరిద్దరూ కూడా అదిరిపోయే ఆన్సర్ లను ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: