రష్యాలో ఇండియన్ 'కోబ్రా' కాటు?

Purushottham Vinay
మన సౌత్ సినిమా ఇండస్ట్రీల హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇప్పుడు మన సౌత్ సినిమాలు కూడా బౌండరీస్ దాటేస్తున్నాయి.. ఎలాంటి ప్రాంతీయ బేధాలు లేకుండా కంటెంట్ నచ్చితే నెత్తిన పెట్టుకునే మన టాలీవుడ్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపిస్తుంది.. బాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇంకా కోలీవుడ్స్ మాత్రమే కాదు.. ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తెలుగు సినిమా స్టామినా చూసి ఎంతగానో ఆశ్చర్యపోతుంది..దీనికి మన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మూవీని, దానికి ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ ఇంకా వరిస్తున్న అవార్డులను ఉదాహరణగా మనం చెప్పొచ్చు..హాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డుల పరంపర కొనసాగుతోంది.. జపాన్‌ దేశంలో రిలీజ్ అవడమే కాక.. ఎక్కువ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసిన సూపర్ స్టార్ రజినీ కాంత్ 'ముత్తు' మూవీ రికార్డుని 27 ఏళ్ల తర్వాత బీట్ చేసి సరికొత్త హిస్టరీని ఆర్ ఆర్ ఆర్ సృష్టించింది.. ఇక అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి చేసిన 'పుష్ప - ది రూల్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి హిట్ అయ్యింది..2021లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.


ఈమధ్య రష్యాలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా మంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.. జపాన్‌లో ఆర్ ఆర్ ఆర్ టీంలానే 'పుష్ప' టీం కూడా రష్యా వెళ్లి అక్కడ సందడి చేశారు.. తెలుగు సినిమాకి విదేశాల్లో ఇంతటి ఆదరణ దక్కడం అంటే నిజంగా గర్వకారణమే.. ఇప్పుడు మరో సినిమా రష్యన్ రిలీజ్‌కి సిద్ధం అవుతోంది..ఆ సినిమానే విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'.. ఆర్.అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల తెలుగు ఇంకా అలాగే తమిళ్‌లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చకుంది..ఒకరకంగా ఆడియన్స్‌కి ఈ సినిమా అర్థంకాక కన్ఫ్యూజ్ అయ్యారు కానీ మూవీ మాత్రం చాలా బాగుంటుంది.. ఓటీటీలో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడీ సినిమాని రష్యన్ భాషలోకి అనువదించి.. 2023 జనవరి 19న అక్కడ భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రష్యన్ ప్రేక్షకులకు 'కోబ్రా' సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: