రజనీకాంత్ "జైలర్" మూవీ గ్లిమ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ "జైలర్" అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిన్న సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా జైలర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. మూవీ యూనిట్ విడుదల చేసిన జైలర్ ఫస్ట్ గ్లిమ్స్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ లుక్ సూపర్ గా ఉండడం , అలాగే అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉండడంతో జైలర్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివ రకు జైలర్ మూవీ గ్లిమ్స్ యూట్యూబ్ లో 3.7 మిలియన్ వ్యూస్ ను , 328 కే లైక్ లను సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటించనుండగా ,  శివ కార్తికేయన్ ఈ మూవీ లో ఒక గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్ను కూడా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: