ఆహా "ఓటిటి" లో "ఊర్వశివో రాక్షసివో" మూవీకి అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  గౌరవం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ "ఊర్వశివీ రాక్షసివో" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఒకే రోజు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ మరియు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయిన 48 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అల్లు శిరీష్ , అను ఇమ్మానుయేల్ జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: