తన నెక్స్ట్ మూవీ టైటిల్ చెప్పేసిన గోపీచంద్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభం లో హీరో గా నటించిన గోపీచంద్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో నటించాడు. అలా కెరీర్ ప్రారంభంలో హీరో మరియు విలన్ పాత్రలలో నటించిన గోపీచంద్ కు విలన్ పాత్రల ద్వారా అద్భుతమైన ఇమేజ్ లభించింది. ఆ తర్వాత మళ్లీ హీరో పాత్రాలలో నటించిన గోపీచంద్ హీరో గాను అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ ను కలిగిన హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే గోపీచంద్ ఆఖరు గా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించింది.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టపబుల్ టాక్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆన్ స్టాపబుల్ తాజా ఎపిసోడ్ కు గోపీచంద్ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇందులో భాగంగా గోపీచంద్ తన తదుపరి మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గోపీచంద్ తన తదుపరి మూవీ ని శ్రీ వాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు , ఆ సినిమాకు రామబాణం అనే టైటిల్ ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే టాక్ షో లోని ప్రభాస్ , గోపీచంద్ కు సంబంధించిన ఎపిసోడ్ ను డిసెంబర్ 16 వ తేదీన స్ట్రీమింగ్ బోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: