అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్న మహేష్ అభిమానులు.. కారణం..?

Divya
సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలలో నటించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ రేర్ కాంబినేషన్లో కనీసం ఒక ఫోటో కైనా వీరు కలిసి ఫోజులిస్తే ఆ అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్, మహేష్ బాబు ఏ రోజు కూడా ఒక దగ్గర కలిసింది లేదు. అలాంటిది ఇటీవల ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ ఇటీవల తన కూతురు నీలిమ గుణ వివాహం జరిపించారు.
హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ రవితో నీలిమ గుణ వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆదివారం రోజున వివాహానికి సంబంధించి రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి మహేష్ బాబు తో పాటు అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత అల్లు అర్జున్ , మహేష్ బాబు ఇద్దరూ కలిసి నీలిమ గుణ రవి దంపతులతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అభిమానులకు మరింత సంతోషాన్ని ఇస్తోంది . ప్రస్తుతం ఈ ఫోటోలు బయటకు రాగా ఇవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా మరోపక్క అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మహేష్ బాబుతో వేదిక పంచుకోవడానికి కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.. కానీ మహేష్ బాబు స్వయంగా వెళ్లి కరచాలనం చేయడంతో అల్లు అర్జున్ వెంటనే వేదిక పైనుండి నిష్క్రమించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు.. అంటూ మహేష్ అభిమానులు అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో మాత్రం అర్థం కావడం లేదు మొత్తానికైతే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: