ఒకే ఫ్రేమ్ లో మహేష్, బన్నీ.. పిక్ వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తే నీలిమా వెడ్డింగ్ రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ వేడుకకు సీని రాజకీయ ప్రముఖులు అంతా కూడా హజరై ఆ నవ దంపతులను ఆశీర్వాదించారు.సీనియర్ హీరో రాజశేఖ్ దంపతులు ఇంకా డైరెక్టర్ రాజమౌళి దంపతులు అలాగే కె. రాఘవేంద్రరావు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్,సూపర్ స్టార్ మహేష్ ఓకేసారి వేదికపై ఉన్న ఫోటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఒకవైపు బన్నీ.. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండడం చూసి అభిమానులు అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.


టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన బాలరామాయణం సినిమాతో గుణశేఖర్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి వంటి  సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణశేఖర్.ముఖ్యంగా ఒక్కడు సినిమా అయితే గుణశేఖర్ ని పెద్ద స్టార్ డైరెక్టర్ ని చేసింది.ఇక ప్రస్తుతం గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ మాత్రం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. తన తండ్రి డైరెక్ట్ చేసిన రుద్రమదేవి చిత్రానికి సహ నిర్మాతగా ఆమె వ్యవహరించారు.ఇంకా అలాగే.. సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమాను కూడా నీలిమ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇక ఈ వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ మాత్రం.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.ఇందులో  రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా అలాగే.. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: