జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి "అవతార్ - 2" కనకవర్షం కురిపిస్తుందా ?

VAMSI
టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన డైరెక్టర్ లలో ఒకరు. కేవలం టైటానిక్ సినిమా తర్వాత తన స్థాయి ఎంతలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను టైటానిక్ కన్నా ముందు కొన్ని సినిమాలు తీసినప్పటికీ దీనికి దక్కిన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. 1997 లో టైటానిక్ సినిమా వచ్చింది, ఈ సినిమాను ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయిన షిప్ ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఒక అందమైన ప్రేమకథను అల్లాడు. ఆ సినిమా తర్వాత కెమరూన్ నుండి వచ్చిన మరో అద్భుతం సృష్టి "అవతార్". ప్రేక్షకులకు సరికొత్త వింత మనుషులను పరిచయం చేశాడు అని చెప్పాలి.
ఈ సినిమా 2009 లో వచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మితం అయింది. కానీ ఓవరాల్ రన్ లో ఈ సినిమా 2 .923 బిలియన్ డాలర్ల కలెక్షన్ లను సాధించింది. అలా మరోసారి జేమ్స్ కామెరూన్ వార్తలలో నిలిచాడు.. కాగా ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని బాషలలో దిగ్విజయంగా ప్రదర్శించబడడంతో మేకర్స్ సీక్వెల్ ను తీయాలన్న ప్లాన్ వేశారు. అయితే వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన అవతార్ సీక్వెల్ కు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న అవతార్ 2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో దర్శనం ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ ట్రైలర్ మరియు టీజర్ లు విపరీతంగా ఆకట్టుకోగా అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఆ అంచనాలను అందుకుని కరోనా తర్వాత వచ్చిన సినిమాలలో కన్నా రికార్డ్ కలెక్షన్ లు సాధిస్తుందా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: