స్టార్ కమెడియన్ కు సర్ప్రైజ్ ఇచ్చిన తలపతి విజయ్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న కమెడియన్ గ కొనసాగుతున్న యోగి బాబు కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన వివరాలను తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు తెలియజేశాడు.
 

తాజాగా తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు హెల్మెట్ పెట్టుకుని , చేతిలో బ్యాట్ పట్టుకొని ఉన్న ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ బ్యాట్ ను తలపతి విజయ్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపించాడు అని యోగి బాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే గతం లోనే విజయ్ మరియు యోగి బాబు కాంబినేషన్ లో కొన్ని మూవీ లు వచ్చాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ లలో చాలా వరకు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ "వారిసు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: