మారుతి మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ లతో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ని  కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన నీది అగర్వాల్ ,  మాళవిక మోహన్ , రీద్ది కుమార్ లు హీరోయిన్ లుగా నటించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు , ప్రభాస్ కు సంబంధించిన రెండవ పాత్ర ఈ మూవీ లో ఇంటర్వెల్ సన్నివేశంలో రివిల్ కనుమట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతి ఈ మూవీ ని హారర్ కామెడీ నేపథ్యం లో తేరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: