ప్రభాస్ జాబితాలో చేరిపోయిన బాలయ్య.. అసలు విషయం ఏంటంటే..?

Divya
రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎక్కువగా మీడియా కంట పడడు.. ఒకవేళ పడినా ఇంటర్వ్యూలు ఇవ్వడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆహా నిర్వాహకుల కోరిక మేరకు బాలయ్య మీద ఉన్న గౌరవంతో అన్ స్టాపబుల్ షో కి అతిధిగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సెట్ నుంచి లీకై అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్లో బాలయ్య హోస్టుగా చేస్తున్న కార్యక్రమానికి గోపిచంద్ అలాగే ప్రభాస్ ఇద్దరూ కూడా హాజరపోతున్నారు. అయితే వీరిద్దరూ ప్రాణ స్నేహితులు అన్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పుడు వీరిద్దరూ బాలయ్యతో ఎలా సందడి చేయబోతున్నారు? ఎలాంటి విషయాలు బాలయ్య వీరి నుంచి బయటకు రాబట్టపోతున్నారు అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయాలతో పాటు అనుష్క తో ప్రభాస్ కి ఉన్న రిలేషన్ గురించి కూడా బాలయ్య బయటపెట్టించే ప్రయత్నం చేయబోతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. మరి వాటన్నిటికీ ఆయన సమాధానం చెబుతాడా లేదా దాటవేస్తాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసే జాబితాలో బాలయ్య కూడా చేరిపోయారు.

అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా షూటింగ్ జరుగుతుండడంతో బాలకృష్ణ కోసం కూడా ప్రభాస్ తన ఇంటి నుండి ఆహారాన్ని తెప్పించి మరీ ఆయనకు రుచి చూపించాడు.  ఇప్పటికే ప్రభాస్ తో కలిసి పని చేసిన ఎంతోమందికి ప్రభాస్ తన ఇంటి భోజనాన్ని రుచి చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలయ్య కూడా చేరిపోయారు. ఆయన తన ఇంటి నుంచి ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: