ధమాకా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి మాస్ జాతర పక్కా..!

Divya
మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ధమాకా.. మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై టిసి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ పాటలు, టీజర్ అన్నీ కూడా సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు నిర్మాతలు. ఈనెల 15వ తేదీన ధమాకా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఇకపోతే ఈ ట్రైలర్ తో మాస్ జాతర పక్కా అంటూ అభిమానులు ముందే ఊహగాలు వ్యక్తం చేసుకుంటున్నారు.  మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. ఇకపోతే రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఈయన నటించిన ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. గత ఏడాది గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా మినహా మరే సినిమా కూడా ఈయనకు పూర్తిస్థాయిలో సక్సెస్ ఇవ్వలేదని చెప్పాలి.

మరి ఈసారి మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాతో ఈయన ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో అని సినీ ప్రేక్షకులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరోపక్క చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర సినిమాలో కూడా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు ఈ సినిమా నుంచీ ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం. మరి ఈ రెండు సినిమాలతోనైనా ఆయన మళ్ళి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: