అడవిశేష్ పై నేటిజన్ల ప్రశ్నలు... షాక్ ఇచ్చిన హీరో...!!

murali krishna
సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ లు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది హీరోలు సినిమాలలో నటించి అవి హిట్ అయితే వచ్చే కోట్ల రెమ్యూనరేషన్ ని బిజినెస్ లలో పెట్టుబడులుగా పెడుతూ ఉంటారు.
టాలీవుడ్ లో రామ్ చరణ్ మహేష్ బాబు లాంటి హీరో ఇలాగే చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో స్టార్ హీరోలే కాకుండా యంగ్ హీరోలు శర్వానంద్, సందీప్ కిషన్ లాంటి హీరోలు కూడా రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ అంటూ రకరకాల రంగాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి మంచి లాభాలను పొందుతున్నారు. అలాగే కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఈ విధంగా హీరోలు సినిమాలు, వ్యాపారాలు, కమర్షియల్ యాడ్స్ ఇలా అన్ని కలిపి ఏడాదికి కొన్ని కోట్లు సంపాదిస్తూ ఉంటారు.
ఇదే విషయం గురించి కొన్ని వెబ్ సైట్ల లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు వారికీ సంబంధించిన ఆస్తులు వివరాలను ఆదాయం వివరాలను పొందుపరుస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో అడవి శేష్ పేరు కూడా చేరిపోయింది. ఒక వెబ్ సైట్ లో 2022లో అడివి శేష్ ఆదాయం ఏకంగా 450 మిలియన్ డాలర్లని రాశారు. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 వేల కోట్లకు పైమాటే అని అని చెప్పవచ్చు. ఈ ఏడాది అనగా 2022లో అడివి శేష్ ఆదాయం 450 మిలియన్ డాలర్లని , ఏడాదికి వచ్చే ఆదాయం రూ. 359 కోట్లు అని, అడివి శేష్ ఒక సినిమాకి 5 కోట్లు ఛార్జ్ చేస్తారని, నెలకు 4 నుంచి 5 కోట్లు ఆదాయం వస్తుందని రాసుకొచ్చారు.
అయితే నెలకి 4 నుంచి 5 కోట్లు సంపాదించే అడివి శేష్ ఏడాదికి 3 కోట్లే సంపాదిస్తున్నారని రాయడమే కామెడీగా ఉంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక నెటిజన్ గూగుల్ లో తప్పుడు సమాచారం ఉంటుందని తెలుసు. అయినా ఆపుకోలేక అడివి శేష్ పారితోషికం ఎంత అని సెర్చ్ చేస్తే.. 450 మిలియన్ డాలర్స్ అని వచ్చింది. నరాలు కట్ అయిపోయాయి తెలుసా?.. అంటూ ఒక నెటిజన్ అడివి శేష్ ని ట్యాగ్ చేస్తూ  చేయగా దానిపై స్పందించిన అడివి శేష్.. మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అంటూ సెటైరికల్ గా అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: