దిల్ రాజు వారసుడు సినిమాపై మొదటిసారి స్పందించిన సురేష్ బాబు..!

Divya
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో దిల్ రాజు, సురేష్ బాబు కూడా ఒకరు అని చెప్పవచ్చు. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా.. సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతూ ఉంటే.. దిల్ రాజు మాత్రం మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఇప్పటివరకు భారీ చిత్రాలను తెరకెక్కించి భారీ స్థాయిలో లాభాలను పొందిన దిల్ రాజు ఇప్పుడు కోలీవుడ్ హీరో విజయ్ తో వారసుడు సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని ఎలాగైనా సరే సంక్రాంతి పండుగ కానుకగా తెలుగులో కూడా విడుదల చేయాలని సన్నాహాలు సిద్ధం చేశారు.

అయితే బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు నష్టం కలుగుతుందని భావించి తెలుగు చిత్ర నిర్మాతల మండలి వారసుడు సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ ఈయన గొడవపడి మరీ తెలుగులో వారసుడు సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లను కేటాయించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అందరూ కూడా దిల్ రాజును విమర్శిస్తున్న నేపథ్యంలో సహ నిర్మాతగా సురేష్ బాబు కూడా స్పందించారు.ఇప్పటివరకు ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వని సురేష్ బాబు ఇప్పుడు దిల్ రాజు ప్రవర్తన గురించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.."  వారసుడు సినిమాను తెలుగులో రిలీజ్ చేయడ అనేది.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత లాభం కోసమే పనిచేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ కూడా కొంత ప్రయోజనం పొందవచ్చు. సహజంగానే ఏ నిర్మాత అయినా సరే తన సినిమా కోసం లేదా సినిమా హీరో కోసం పనిచేస్తారు అన్నది వాస్తవమే.. ఇందులో మనం దిల్ రాజును తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల గురించి కూడా దిల్ రాజు ఆలోచించాలి"  అంటూ సురేష్ బాబు వెల్లడించారు. మరి ఈ విషయంపై దిల్ రాజు ఏ విధంగా అర్థం చేసుకొని మరే విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: