కీర్తి సురేష్ ఆస్తుల విలువ అన్ని కోట్లా?

Satvika
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో నటించింది.ఇక మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజీ సంపాదించుకుంది . ప్రముఖ సీనియర్ నటి మేనక కుమార్తెగా మలయాళీ ఇండస్ట్రీ నుంచి తెలుగులో స్థిరపడిపోయింది. మహానటి సినిమాలో నటించినందుకు గానూ కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా లభించింది. ఇకపోతే ఇటీవల తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మొదటిసారి గ్లామర్ షో చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ntr పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ అందుకుంటే కీర్తి సురేష్ లైఫ్ కూడా మారిపోయినట్టే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందట.ఈ పాత్రకు రష్మిక మందన్నను కూడా పరిశీలించినట్లు.. కానీ చివరికి కీర్తి సురేష్ ఓకే చెప్పిందని తెలుస్తుంది..

అయితే త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ భారీ ప్రాజెక్టుకి అనిరుధ్ సంగీతం అందిస్తూ ఉండగా యువసేన ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి రానుంది ఈ సినిమా..అమ్మడు ఆస్తుల విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. సంవత్సరానికి 6 కోట్ల రూపాయల మేర సంపాదిస్తుందని సమాచారం. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇన్ని కోట్లు కూడబెట్టిందా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక పోతే ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, పెద్దలకు వచ్చిన వివాహాన్ని చేసుకోబోతుందని త్వరలోనే పెళ్లి డేట్ కూడా ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి..చూడాలి ఎవరిని చేసుకుంటుందో...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: