త్రిపుల్ ఆర్ కు ఆస్కార్.. బ్రేకింగ్ న్యూస్..

Satvika
తెలుగు సినిమా చరిత్రను ప్రపంచాని కి చాటిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా పాన్ ఇండియా కాదు.. అంతకు మించి ఎదో వుందో అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమా ను చూసిన విదేశీయులు అయితే అవాక్కయిపోయారు. ఏం సినిమా అంటూ మెచ్చుకున్నారు. ఒక భారత సినిమా ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను అవాక్కయ్యేలా చేయడం అనేది మామూలు విషయం కాదు.
 

అది కేవలం ఆర్ఆర్ఆర్ కే సాధ్యం అయింది. అయితే.. ఒక తెలుగు సినిమా ఇన్ని సంచలనాల ను సృష్టించడం ఇదే అరుదు. అలాగే.. ఆస్కార్ బరిలో ఒక తెలుగు సినిమా నిలవడం కూడా ఇదే తొలిసారి. ఆస్కార్ రేసులో కి ఈ సినిమా వెళ్లడం తో తెలుగు సినిమా ఖ్యాతి ఒక్కసారిగా ప్రపంచాన్ని తాకింది. ఆస్కార్ కంటే ముందు ఆర్ఆర్ఆర్ సినిమా చాలా అవార్డులు వచ్చాయి. న్యూయార్క్ ఫిలిం సర్కిల్ బెస్ట్ డైరెక్టర్స్ అవార్డు కూడా దక్కించుకుంది ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ను దక్కించుకున్నారు. నిజానికి.. న్యూయార్క్ ఫిలిం సర్కిల్ లో అవార్డు వచ్చిందంటే వాళ్లకు ఆస్కార్ లోనూ అవార్డ్ వస్తుంది. అందుకే.. అక్కడ కూడా సత్తా చాటుతుందని నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ కాస్ట్ అండ్ క్రూని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డు విన్నర్ గా ప్రకటించింది. ఈ అవార్డు ను త్వరలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు అందజేయనున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి అవార్డు రావడం అనేది కూడా చిన్న విషయం కాదు. అందుకే.. ఆర్ఆర్ఆర్ కు త్వరలోనే ఆస్కార్ కూడా వస్తుందంటూ సినీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ అవార్డు సినిమా కు వస్తుందో లేదో చుద్దాము..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: