"చంద్రముఖి 2" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నయన తార , జ్యోతిక , ప్రభు ముఖ్య పాత్రలలో పి వాసు దర్శకత్వం లో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. తమిళం లో రూపొందిన చంద్రముఖి సినిమా తెలుగు లో కూడా డబ్  అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి తమిళ మరియు తెలుగు బాక్స్ ఆఫీస్ ల దగ్గర భారీ కలెక్షన్ లు కూడా లభించాయి. ఇలా ఆ కాలంలో భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న చంద్రముఖి మూవీ కి సీక్వల్ గా చంద్రముఖి 2 మూవీ ని ప్రస్తుతం దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చంద్రముఖి 2 మూవీ లో రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి కూడా అయింది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా చంద్రముఖి 2 మూవీ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనాథ్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.  అలాగే కంగనా రణౌత్ కూడా చంద్రముఖి 2 మూవీ లో నటిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా చంద్రముఖి 2 మూవీ యూనిట్ ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా చంద్రముఖి 2 మూవీ యూనిట్ ఈ సినిమాలో కంగనా రనౌత్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చంద్రముఖి మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో చంద్రముఖి 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: