చీర కట్టులో ఆకట్టుకుంటున్న అనుపమ..!!

Divya
టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ గా పేరు పొందిన అనుపమ పరమేశ్వరన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట నితిన్ నటించిన అ ఆ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకొని యంగ్ హీరోయిన్లకు దీటుగా నటిస్తోంది. ఇక తాజాగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ -2 చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యింది.
అనుపమ మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ముఖ్యంగా అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటోంది. శతమానం భవతి ,హలో గురు ప్రేమకోసమే ,ఉన్నది ఒక్కటే జిందగీ వంటి చిత్రాలలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఇప్పుడు తాజాగా అనుపమ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మోడరన్ దుస్తులలో కనిపించే అనుపమ ఇప్పుడు తాజాగా సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపించడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా బ్లూ కలర్ చీరలో చిరునవ్వులు చిందిస్తూ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అనుపమ ఈ ఫోటోలు చూసిన అభిమానులు నేటిజన్లు సైతం మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా అనుపమ ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జడలో మల్లెపూలు ఆభరణాలతో అనుపమ అచ్చం దేవతల కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొన్ని స్టిల్స్ క్యూట్ గా మరికొన్ని స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత స్పీడ్ పెంచింది. ఇతర హీరోయిన్ల  లాగా ఎక్కువగా గ్లామర్ షో చేయకుండా యువతకి అభిమాన హీరోయిన్ గా పేరు సంపాదించింది అనుపమ. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: