"షంషేరా" మూవీ ఫ్లాప్ కావడానికి అదే కారణం... రన్బీర్ కపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్బీర్ కపూర్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు అభిమానాన్ని సంపాదించుకున్నాడు . రన్బీర్ కపూర్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ హిందీ లో నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో డబ్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా రన్బీర్ కపూర్ మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రన్బీర్ కపూర్ ఈ సంవత్సరం సంషేరా బ్రహ్మాస్త్ర అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సంషేరా మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరచగా , బ్రహ్మస్త్ర మూవీ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రన్బీర్ కపూర్ "సంషేరా" మూవీ అపజయం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రన్బీర్ కపూర్ "సంషేరా" మూవీ అపజయం గురించి మాట్లాడుతూ ... సంషేరా మూవీ ఫెయిల్ కావడం వెనక మేము చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నా గడ్డం. నేను ఈ మూవీ కోసం కృత్రిమ గడ్డాన్ని పెట్టుకున్నాను. ఎండలో షూటింగ్ చేసినప్పుడు అది అంత సహజంగా కనిపించ లేదు. ముఖానికి దాన్ని అతికి పెట్టినట్టు కనిపించింది. అందుకే ఈ సినిమా హిట్ అవ్వలేదు అని అనుకుంటున్నాను అని రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే సంషేరా  మూవీ కి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: