షారుక్ ఖాన్ "పఠాన్" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ మూవీలో షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ అత్యద్భుతంగా ఉండడం , ఈ టీజర్ లో షారుఖ్ ఖాన్ లుక్స్ , దీపికా పడుకొనే అందం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
 

ఈ మూవీ ని జనవరి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ నుండి మొదటి పాటను డిసెంబర్ 12 వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫోటోలో దీపికా పదుకొనే అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బికినీ ని వేసుకొని ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: