శ్రీహాన్ బ్రేకప్ పై స్పందించిన సిరి.. చివరికి నిజం బయట పెట్టింది?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనే ప్లాట్ ఫామ్ ని వినియోగించుకుంటున్న ఎంతో మంది యువతీ, యువకులు బాగా పాపులారిటీ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ వేదికగా ఉన్న టాలెంట్ ను బయటపెట్టి ఏకంగా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.  ఇలా యూట్యూబ్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన శ్రీహాన్ ఇటీవల బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు అని చెప్పాలి.

 అదే సమయంలో గత సీజన్లో శ్రీహాన్ ప్రేయసి సిరి కూడా సందడి చేసింది  ఒకవైపు బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ గేమ్ ఆడుతూ ఎంతో కష్టపడుతూ ఉంటే.. బయట ఉన్న సిరి అతని మద్దతు కూడగట్టుకునేందుకు ఎంతో కష్టపడుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే సిరి శ్రీహాన్ గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. సిరీ, షణ్ముఖ్ తో బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల సిరి, శ్రీహాన్ మధ్య విభేదాలు వచ్చాయని బ్రేకప్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి  ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి వార్తలు తెరమీదకి వచ్చాయి. అయితే శ్రీహన్ తో బ్రేకప్ గురించి స్వయంగా సిరి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

 ఇటీవల బీబీ కేఫ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న సిరి పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఇక సిరి శ్రీహాన్ బ్రేకప్ అంటూ వచ్చిన ట్రోల్ ని సిరి కి చూపించగా ఇదేప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోయింది సిరి. అయితే గత సీజన్లో నేను కంటెస్టెంట్ గా ఉండి బాగా హౌస్ నుంచి బయటికి వచ్చిన సమయంలో మా మధ్య చాలా గొడవలు జరిగాయి. అది మాటల్లో చెప్పలేను. చివరికి బ్రేకప్ వరకువెళ్ళింది. కానీ ఆ గొడవలే మా బంధాన్ని మరింత బలంగా మార్చేసాయ్. ఇక ఇప్పుడు ఎప్పుడూ విడిపోము అన్న క్లారిటీ వచ్చింది అంటూ సిరి క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: