దిల్ రాజ్ ను ఆట పట్టించిన బాలకృష్ణ !

Seetha Sailaja
ఈమధ్య జరిగిన బాలకృష్ణ అనీల్ రావిపూడి మూవీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా వచ్చి బాలయ్యకు అభినందనలు తెలియచేసారు. గత కొంతకాలంగా బాలయ్య అల్లు అరవింద్ ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి కొనసాగింపుగా ఈమువీ ప్రారంభానికి సంబంధించిన క్లాప్ ను అరవింద్ చేసాడు.

ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అందర్నీ బాలయ్య తనదైన శైలిలో పలకరిస్తూ ఒక ఆట పట్టించాడు. ఈ కార్యక్రమానికి మరో అతిధిగా వచ్చిన దిల్ రాజ్ ను బాలయ్య పలకరిస్తూ ‘మీ పేరు రాజు లేదా దిల్ రాజ్’ అని అడిగాడట. దానికి దిల్ రాజ్ సమాధానం ఇస్తూ తాను తీసిన ‘దిల్’ మూవీ సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి తనను ఇండస్ట్రీలో అందరు దిల్ రాజ్ అని పిలుస్తున్నట్లు చెప్పాడట.

దిల్ రాజ్ చెప్పిన ఈ సమాధానానికి బాలయ్య నవ్వుతూ ‘మీకు నిజంగా దిల్ ఉందా’ అంటూ నవ్వుతూ ప్రశ్నించాడట. బాలయ్య వేసిన ఈ సెటైర్ కు ఏమి సమాధానం చెప్పాలో తెలియక దిల్ రాజ్ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడట. ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య జోక్ ల పైనే చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజ్ ను ఇలా ఆట పట్టించడం వెనుక కేవలం బాలయ్యకు ఉన్న అందరికీ తెలిసిన హాస్య చతురతా లేదంటే ఈ సెటైర్ వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఇదే కార్యక్రమానికి మరో అతిధిగా వచ్చిన రాఘవేంద్రరావు బాలయ్య వద్దకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కరోనా సమయంలో షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు అని అంటూ తన పిడికిలి బిగించి రాఘవేంద్రరావు బాడీ పై ఒక గుద్దు గుద్దడంతో రాఘవేంద్రరావు కూడ ఒక్క క్షణం షాక్ అయినట్లు తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ ఆ ఈవెంట్ కు వచ్చిన అందర్నీ రకరకాల జోక్స్ తో నవ్విస్తూ ఆ ఫంక్షన్ ను సరదాగా మార్చడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: