కత్తి పట్టిన పవర్ స్టార్.. పిక్ వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా మంచి నైపుణ్యం ఉన్న సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి మొదలుకుని తాజా మూవీ హరిహర వీరమల్లు దాకా చాలా మూవీల్లో ఎక్కడో ఒక చోట తన మార్షల్‌ ఆర్ట్స్‌ ట్యాలెంట్‌ను ఆయన చూపిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్. 'రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చాను' అని తన పోస్టుకు క్యాప్షన్‌ ని ఇచ్చారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. కత్తిపట్టిన కత్తిలా ఉన్నాడంటూ పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ఈ ఫొటోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్ చారిత్రాత్మక కథాంశంతో ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ బందిపోటుగా కనిపిస్తారని ప్రచారం జరగుతోంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్‌ స్టిల్స్‌ ఇంకా ఫొటోలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.


ఇక హరిహర వీరమల్లు మూవీలో కథానుగుణంగా వీరమల్లు పాత్రకు మార్షల్ ఆర్ట్స్ విద్య చాలా అవసరమైనందున.. ఇందుకోసం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ మూవీ ద్వారా తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని మరోసారి చూపించబోతున్నారు పవన్‌ కళ్యాణ్. అందుకు తగ్గట్లే ట్రైనర్‌తో కలిసి పవన్‌ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది టీం. ఇక 17వ శతాబ్దంలో మొగలుల కాలం నాటి కథతో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోందని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో ఇస్మార్ట్‌ బ్యూటీ  నిధి అగర్వాల్ పవన్‌ సరసన నటించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ ఇంకా అలాగే నర్గీస్‌ ఫక్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇక వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందని సమాచారం .
తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: