ఆ తేదీలలో రజినీ కాంత్ "శివాజీ" మూవీ రీ రిలీజ్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన మూవీ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రజినీ కాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో శివాజీ సినిమా ఒకటి. శివాజీ సినిమాకు దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం వహించగా , శ్రేయ ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించగా , లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో ఒక ప్రత్యేక పాటలో కనిపించింది.

ఈ మూవీ ఆ కాలంలో అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ డిసెంబర్ 12 వ తేదీన సూపర్ స్టార్ రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్. చేయనున్నారు డిసెంబర్ 9 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు పి వి ఆర్ మరియు సినీ పోలిస్ చైన్‌ ల ఎంపిక చేసిన స్క్రీన్‌ లలో శివాజీ మూవీ ని తమిళం మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ లో భాగంగా శివాజీ మూవీ కి ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: