పెళ్లిపై మరోసారి స్పందించిన తమన్నా..!

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. తమన్నా కేవలం తెలుగు మూవీ లలో మాత్రమే కాకుండా ఇతర భాష మూవీ లలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే బాహుబలి , సైరా నరసింహా రెడ్డి లాంటి పాన్ ఇండియా మూవీ లలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఈ మూవీ ల ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా , సత్య దేవ్ హీరో గా తెరకెక్కిన గుర్తుందా సీతాకాలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లిపై ఇప్పటి వరకే చాలా రూమర్ లు వచ్చాయి. ఓ డాక్టర్ తో ... ఓ బిజినెస్ మాన్ తో నా పెళ్లి అంటూ చాలా మంది రాశారు. అవన్నీ తప్పు.  పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన భాగం. అలాంటి సందర్భం వస్తే వేడుకల అందరికీ తెలిసేలా చేసుకుంటా. ఇక కెరియర్ మొదట్లో నటన పై ఎంతో కసిగా ఉన్నాను. ఇప్పుడు కూడా అంతే కసిగా ఉన్నాను అని తమన్నా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: