చివరికి అలాంటి క్యారెక్టర్ కూడా చెయ్యడానికి తెగించిన మంచు లక్ష్మి..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ నటుడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల మంచు లక్ష్మి ఓ బోల్డ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆమె లిప్ లాక్ సన్నివేశాలలో సైతం నటించడం జరిగింది. అయితే స్టార్ కిడ్ మంచు లక్ష్మి ఇలాంటి శృంగార సన్నివేశాల్లో పాల్గొనడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది .అయితే దీని గురించి టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చ నడుస్తుంది .మంచు లక్ష్మి ట్రోల్లింగ్ మెటీరియల్ గానే జనాలకు పరిచయం అన్నమాట. అంతగా ఆమె ట్రోల్లింగ్ మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 

ఏళ్ల తరబడి అమెరికాలో ఉన్న ఈ మీ ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది ఇక ఈ క్రమంలో ఆమె మాట్లాడే తెలుగు చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే ఆమె తెలుగు మాట్లాడే విధానం కూడా ట్రోల్స్ కి గురవుతూనే ఉంటుంది అలాగే మంచు లక్ష్మి వీళ్ళు చేసే ఇంటర్వ్యూలు కొంచెం అతిగా ఉంటాయి అని చెప్పాలి .అయితే వాళ్లను వాళ్లే ఎక్కడికో లేపుకోవడం జనాలకు అస్సలు నచ్చదు సెల్ఫ్ డబ్బా అంటూ వీరిపై ఎప్పుడూ కామెంట్లు చేస్తూనే ఉంటారు జనాలు. అయితే ట్రోల్స్ కారణంగా ఈమె ప్రతిభ గురించి చాలామందికి తెలియదు అని చెప్పాలి.ఇకపోతే మంచు లక్ష్మి అమెరికాలో టెలివిజన్ హోస్ట్ గా పని చేయడం జరిగింది.

ఒకటి రెండు ఇంగ్లీషులో సినిమాల్లో కూడా ఈమె నటించడం జరిగింది. అయితే ఈమె ఇండియాకు వచ్చిన తరువాత హీరోయిన్ కావాలని ఆశపడ్డారు కాగా సిద్ధార్థ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలో ఆమె మంత్రగత్తెగా విలన్ రోల్ చేశారు. దాని అనంతరం గుండెల్లో గోదారి దొంగాట సినిమాల్లో హీరోయిన్గా నటించిన జరిగింది. ఇక ఈమెకు మంచు హీరోల లాగా నటిగా బ్రేక్ రాలేదు సొంత బ్యానర్ లో చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈమె ఒక పాత్రలో హైలైట్ అవ్వడం జరిగింది మోహన్ లాల్ హీరోగా నటించిన మాన్స్టర్ సినిమాలో మంచి లక్ష్మి లెస్బియన్ పాత్రలో కనిపించడం జరిగింది. అయితే ఒక అమ్మాయి తో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ సీన్స్ అత్యంత వల్గర్ గా ఏమీ లేవు కానీ అదే సమయంలో మంచు లక్ష్మి నటనతో ఆమె టాలెంట్ చూపించింది. దీంతో మంచు లక్ష్మి ఇలాంటి పాత్రల్లో కూడా నటిస్తున్న అంటూ వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: