కనెక్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్..!

Divya
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నయనతార సుపరిచితమే.. ఎక్కువగా ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. గతంలో అనేకమంది హీరోలతో ఎన్నో చిత్రాలలో నటించిన నయనతార ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ సినిమాలలో నటిస్తూ ఉంటోంది. రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నయనతార అద్భుతమైన నటన ప్రదర్శించింది.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు కనెక్ట్ అనే హర్రర్ చిత్రంతో రావడానికి సిద్ధమయ్యింది.
డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లను చిత్ర బృందం మొదలుపెట్టారు. డిసెంబర్ 9వ తేదీన మిడ్ నైట్.. 12వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. సత్యరాజ్.. హనియ నఫీసా కీలకపాత్రలో నటిస్తున్నారు. నయనతార  భర్త విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సినీ చరిత్రలోనే మొదటిసారి బ్రేక్ లేకుండా 99 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం.  నిజానికి హారర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా మధ్యలో బ్రేక్ పెడితే భయం అనే ఫీలింగ్ పోతుంది అని 99 నిమిషాల పాటు ప్రేక్షకులను భయపెట్టడానికి నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తమిళనాడు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి అందరూ కలిసి ఎన్నో అంచనాల మధ్య విడుదల చేస్తున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: