మరాఠీ మూవీలో నటించబోతున్న అక్షయ్ కుమార్..!

Pulgam Srinivas
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్షయ్ కుమార్ ఇప్పటికే ఎన్నో సినిమా లలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో తాను నటించిన హిందీ మూవీ ల ద్వారానే టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం అక్షయ్ కుమార్ రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సంవత్సరం మొదట గా అక్షయ్ కుమార్ రక్షా బంధన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  

ఆ తర్వాత పృద్విరాజ్ సామ్రాట్ మూవీ తో ప్రేక్షకులను అలంకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. కాకపోతే ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి. తాజాగా అక్షయ్ కుమార్ తన తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తాజాగా అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియా వేదికగా ... వేదాంత్ మరాఠీ విర్ దౌడ్లేసాత్ అనే మరాఠీ మూవీ లో నటించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.  ఈ మూవీ లో శివాజీ పాత్రను పోషించడం తన అదృష్టం అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఆయన జీవితం నుంచి పొందిన స్ఫూర్తితో ,  అమ్మ ఆశీర్వాదం తో మూవీ కోసం తనవంతు కృషి చేస్తాను అని అక్షయ్ కుమార్ తెలిపాడు. అలాగే అందరూ ఆశీర్వదించాలి అని అక్షయ్ కుమార్ కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: