టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంవత్సరం అత్యధిక లాభాలను అందుకున్న మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని స్టేట్ తెలుగు మూవీలు కాగా , మరికొన్ని డబ్బింగ్ సినిమాలు. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా , మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు మూవీలు మరియు డబ్బింగ్ మూవీ లలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ లాభాలను అందుకున్న  8 సినిమాల వివరాలను తెలుసుకుందాం.


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 150 కోట్లకు పైగా లాభాలను అందుకుంది. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 45.5 కోట్ల లాభాలను అందుకుంది. హను రాగవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29 కోట్ల లాభాలను అందుకుంది. కన్నడ సినిమా కాంతారా కొన్ని రోజుల క్రితమే తెలుగులో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కోట్ల లాభాలు వచ్చాయి.  కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో తరికెక్కిన బింబిసారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల లాభాలను అందుకుంది. మేజర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల లాభాలను అందుకుంది. విక్రమ్ మూవీ 10 కోట్ల లాభాలను అందుకుంది. డీజే టిల్లు మూవీ 8 కోట్ల లాభాలను అందుకుంది. బ్రహ్మాస్త్ర మూవీ 8 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: