ఆఖరికి అషు రెడ్డి కాళ్లు కూడా పట్టేసుకున్న ఆర్జీవీ..!

shami
పాతికేళ్ల క్రితం శివ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ఆర్జీవి ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిన విషయం తెలిసిందే. అదీగాక ఈమధ్య ఆయన చేస్తున్న అడల్ట్ కంటెట్ ఇంటర్వ్యూస్ అన్ని కాస్త కూస్తో అభిమానించే వారికి కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. తనకు నచ్చిన పనిని ఎవరేం అనుకున్నా తాను చేస్తానని చెప్పే వర్మ ఈమధ్య బుల్లితెర హాట్ యాంకర్స్ తో చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. యాంకర్లేమో ఆర్జీవి క్రేజ్ ని వాడుకుంటుంటే.. వర్మ వారి అందాన్ని ఆస్వాధిస్తున్నాడు.
లేటెస్ట్ గా బిగ్ బాస్ అషు రెడ్డి తో స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆర్జీవి. ఆమె కాళ్లు పట్టుకుని షాక్ ఇచ్చాడు. మరీ దారుణంగా అషు కాలు మీద కాలేసుకుంటే ఆమె ఎదురుగా కూర్చుని ఆమె కాలిని చేతితో తాకుతూ పరవశం పొందాడు ఆర్జీవి. ఇది చూసిన ఆడియన్స్ ఇద్దరు ఎంతగా దిగజారుతున్నారంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అషు రెడ్డి కూడా ఈమధ్య వరుస హాట్ షోస్ తో వార్తల్లో నిలుస్తుంది.
హాట్ హాట్ ఫోటోలతో అషు చేస్తున్న గ్లామర్ షో కి ఇన్ స్టాగ్రాం షేక్ అవుతుంది. తన ఫాలోవర్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తూ గ్లామర్ షోలో రోజు రోజుకి శృతిమించుతుంది అషు రెడ్డి. లేటెస్ట్ గా ఆర్జీవితో డేంజరస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అషు రెడ్డి వారి వ్యవహారంతో ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. బోల్డ్ యాంకర్ గా ఆర్జీవి స్పెషల్ చిట్ చాట్ చూసిన ఆడియన్స్ బాబోయ్ అనేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కూడా కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అని హింట్ ఇస్తున్నారు. సినిమాలే కాదు ఇంటర్వ్యూస్ తో కూడా ఆర్జీవి.. అషు రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. డిసెంబర్ 9న ఆర్జీవి తీసిన డేంజరస్ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం అషుతో ఇలా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు ఆర్జీవి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: