మహేష్ 28వ మూవీలో విలన్ గా కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం బ్రహ్మోత్సవం , స్పైడర్ మూవీ లతో వరుసగా రెండు అపజేయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. అలా వరుసగా రెండు అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న మహేష్ బాబు ఆ తరువాత భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట ఇలా వరుసగా నాలుగు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరకేక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీగా రూపొందుతుంది. వరస విజయాల తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు ఈ మూవీ లో హీరో గా నటించడం ,  అలా వైకుంఠపురంలో  లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించే అవకాశం ఉంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: