వెంకీ కుడుముల మూవీలో అలా కనిపించబోతున్న నితిన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకీ కుడుమల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకీ కుడుముల నాగ శౌర్య హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఛలో మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఛలో మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన భీష్మ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా వరుసగా రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకున్న ఈ దర్శకుడి కి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో  సినిమా చేసే అవకాశం దక్కింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి మరియు వెంకి కుడుమల కాంబినేషన్ మూవీ ఆగిపోయింది. దానితో వెంకీ కుడుముల , నితిన్ తో ఒక మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన భీష్మ మూవీ మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తేరకేక్కబోయే తదుపరి ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే వెంకీ కుడుముల , నితిన్ కు కథ చెప్పినట్టు , ఆ కథ బాగా నచ్చిన నితిన్ వెంటనే వెంకీ కుడుమల దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే నితిన్ ,  వెంకి కుడుముల దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో విడాకులు తీసుకొని భార్యకు దూరంగా ఉండే భర్త పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈ మూవీ లో కూడా అద్భుతమైన కామెడీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: