పవన్ నిర్ణయాల పై కొనసాగుతున్న సస్పెన్స్ !

Seetha Sailaja

పవన్ రాజకీయాలలోనే కాదు సినిమాల విషయంలో కూడ పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. అతడు నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఎప్పటికి పూర్తి అవుతుందో క్లారిటీ లేదు. మరొకవైపు నెగ్గినా నెగ్గకపోయినా తాను రాజకీయాలను కొనసాగిస్తూ జనం మధ్య ఉంటానని తనను ఫెయిల్యూర్ పొలిటీషాన్ గా తన ప్రత్యర్థులు ప్రచారం చేసినా తాను పట్టించుకోను అంటూ పవన్ చెపుతున్న మాటలు విని చాలామంది షాక్ అవుతున్నారు.

2024లో రాబోతున్న ఎన్నికల విషయంలో పవన్ తన ఆలోచన ఏమిటో క్లారిటీ ఇవ్వకుండానే వరసపెట్టి ఒప్పుకుంటున్న సినిమాల లిస్టు చూసి ఈసినిమాలు అన్నీ పవన్ ఎప్పుడు పూర్తి చేస్తాడు అంటూ అతడి అభిమానులు కూడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేటెస్ట్ గా సుజిత్ దర్శకత్వంలో పవన్ అంగీకరించిన సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు అన్న సందేహాలు అందరీలో ఉన్నాయి.

ఈపరిస్థితులు ఇలా ఉంటే పవన్ హరీష్ శంకర్ ల దర్శకత్వంలో ప్రారంభం కావలసి ఉన్న మూవీ పూజా కార్యక్రమాలు ఈవారంలో జరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలలో లీకులు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మాణం చేసే ఈమూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉంది. రకరకాల కారణాలతో ఈమూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి పవన్ కేవలం పూజా కార్యక్రమాలతో మాత్రమే సరిపెడతాడ నిజంగానే ఈమూవీ షూటింగ్ లో పాల్గొంటాడా అన్న విషయమై కొంతమంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.

దీనికికారణం పవన్ కు రెగ్యులర్ గా షూటింగ్ కు వచ్చే అలవాటు చాల తక్కువ అని అంటారు. దీనితో వరసగా షూటింగ్ కు రాకుండా ఒకవైపు హరీష్ శంకర్ మూవీ మరొకవైపు సుజిత్ ల సినిమాలను పూర్తి చేయాలి అంటే పవన్ తన పద్ధతి పూర్తిగా మార్చుకోవాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కు పార్ట్ టైమ్ పొలిటీషాన్ గా ముద్ర పడింది. ఇలాంటి పరిస్థితులలో పవన్ అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా పవన్ తాను కన్ఫ్యూజ్ లో ఉంటూ ఇండస్ట్రీ వర్గాలను కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: