ఆశిష్ "సెల్ఫిష్" మూవీ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆశిష్ పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు . ఈ మూవీ లో ఆశిష్ సరసన అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ విడుదల అయిన రౌడీ బాయ్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . రౌడీ బాయ్స్ మూవీ కాలేజీలో జరిగే గొడవలు మరియు ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది .
 

ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్న ఆశిష్ తన తదుపరి మూవీ గా సెల్ఫిష్‌ లో నటించబోతున్నాడు . చాలా రోజుల క్రితమే ఈ మూవీ టైటిల్ ను మూవీ యూనిట్ ప్రకటించింది . సెల్ఫిష్ మూవీకి కాశీ విశాల్ దర్శకత్వం వహించబోతున్నాడు . శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సెల్ఫిష్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ని ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఆశిష్ స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: