వారిసు: పోటీగా తునివు.. ఇక తెలుగు రాష్ట్రాలే దిక్కు?

Purushottham Vinay
ఇక తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెలుగు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వారిసు చిత్రం వల్ల నిర్మాత దిల్ రాజు అయితే బాగా ఫేమస్ అవుతున్నాడు. అతడు రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు.దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఒక్కో రకంగా సమస్యల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచే విషయంపై ఇప్పుడు పెద్ద గొడవే జరుగుతోంది.థియేటర్ల లెక్కపై రెండు ఇండస్ట్రీల మధ్య చాలా పెద్ద రగడ నడుస్తోంది.ఇక తెలుగులో రిలీజ్ చేయనివ్వకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ లింగుస్వామి లాంటి కోలీవుడ్ డైరెక్టర్స్ సీరియసయ్యేంత వరకూ వ్యవహారం వచ్చింది. తమిళనాడులో అజిత్ తునివు సినిమాకి ఎక్కువ థియేటర్ లు దొరికాయి. అందువల్ల వారిసు సినిమాకి వసూళ్లు భారీగా వచ్చే ఛాన్స్ తక్కువ. ఇక సచ్చినట్టు దిల్ రాజు భారీ వసూళ్ల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని భారీగా రిలీజ్ చెయ్యాలి.అందుకే తెలుగులో ఎక్కువ థియేటర్లు ఈ సినిమాకి కేటాయించే పనిలో వున్నాడు దిల్ రాజు.


ఇక ఈ ఇష్యూపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది రాకముందే మరో వివాదం దిల్ రాజు మెడకు పాములా చుట్టుకుంది. వారిసు చిత్రానికి గాను హీరో విజయ్ కి భారీ పారితోషికం ముట్టజెప్పాడట నిర్మాత దిల్ రాజు. దళపతి విజయ్ కెరీర్లోనే ఇదే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని సమాచారం తెలుస్తుంది. రూ. 105 కోట్లు ఇంకా అలాగే ప్లస్ జీఎస్టీ కింద రూ. 9 కోట్లు మొత్తంగా రూ. 124 కోట్లు ఇచ్చాడని సమాచారం తెలుస్తుంది.ఇక విజయ్ కోలీవుడ్ హీరోనే అయినా కాని ఇంతవరకూ తమిళ్ లో కూడా ఇంతలా ఏ మేకర్ అతనికి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. దీంతో ఉన్న గొడవలకి ఈ న్యూస్ ఇంకొంచెం ఆజ్యం పోసినట్టవుతోంది.నిజానికి దిల్ రాజు తెలుగుతో పోలిస్తే తమిళ చిత్రాలకు ఇంకా అలాగే అక్కడి స్టార్లకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడన్న వాదనలు కొన్నాళ్లుగా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5న నాగార్జున ఘోస్ట్ ఇంకా అలాగే చిరు గాడ్ ఫాదర్ చిత్రాలున్నా సెప్టెంబర్ 30న విడుదలైన డబ్ మూవీ పొన్నియిన్ సెల్వన్ సినిమాకి ఎక్కువ థియేటర్లివ్వడంతో దిల్ రాజుపై కామెంట్స్ అనేవి మరింత ఎక్కువయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: