అన్ని కోట్ల ఆస్తులను పోగొట్టుకున్నాను... చంద్రమోహన్..!

Pulgam Srinivas
అలనాటి కాలంలో ఎన్నో సినిమాలలో హీరో పాత్రాలలో నూ మరియు , ఇతర ముఖ్య పాత్ర లోనూ నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన చంద్ర మోహన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చంద్ర మోహన్ అలనాటి కాలంలోని సినిమాల్లో మాత్రమే కాకుండా , ఈతరం హీరోలతో కూడా అనేక సినిమా లలో నటించి ప్రేక్షకులను అలరించాడు . అలాగే చంద్ర మోహన్ తాను నటించిన ఎన్నో సినిమా లలో తన వైవిధ్యమైన నటన తో ప్రేక్షకులను మెప్పించాడు . ఇలా ఎన్నో సంవత్సరాల పాటు తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన చంద్ర మోహన్ ఈ మధ్య కాలం లో అంత చురుగ్గా సినిమాల్లో నటించడం లేదు .

అలాగే చంద్ర మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం చాలా వరకు తగ్గించాడు . చంద్ర మోహన్ తాను సంపాదించిన దాని కంటే కోల్పోయినది ఎక్కువ అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. తాజాగా చంద్ర మోహన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... అప్పట్లో కొంపల్లిలో 35 ఎకరాలు ద్రాక్ష తోటను కొనుగోలు చేశాను. కాకపోతే ఆ ద్రాక్ష తోటను మేనేజ్ చేయలేక అమ్మేశాను. అలాగే శోభన్ బాబు చెప్తున్నా వినకుండా చెన్నై దగ్గర 6 ఏకారాలు  అమ్మాను. చెన్నైలో అమ్మిన 6 ఎకరాల ధర ఈ రోజు 30 కోట్ల వరకు ఉంటుంది. అలాగే శంషాబాద్ వద్ద 6 ఎకరాలు కొని అమ్మేశా ఇలా దాదాపు 100 కోట్ల దాకా పోగొట్టుకున్నాను అని తాజాగా చంద్ర మోహన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చంద్ర మోహన్ ఆఖరుగా లౌక్యం మూవీ తో ప్రేక్షకులను బాగా అలరించాడు. ఈ మూవీ సూపర్ హిట్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: